కరోనా వచ్చి మమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టింది!
on Apr 27, 2021
బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లలో కొందరికి అవకాశాలు వస్తున్నాయి. కొందరికి రావడం లేదు. అయితే అన్ని సీజన్ల సంగతి పక్కన పెడితే.. సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్లకు మాత్రం అవకాశాలు బాగా వస్తున్నాయి. విన్నర్ అభిజిత్ స్టోరీలు వినే పనిలో ఉంటే.. సొహేల్, అఖిల్ లాంటి వాళ్లు సినిమాలు మొదలుపెట్టేశారు. మెహబూబ్, మోనాల్, దివిలు వెబ్ సిరీస్‌లతో బిజీ అయ్యారు. హారిక, లాస్య, నోయెల్, అరియనా, అవినాష్ లాంటి వాళ్లు ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు.
అయితే సీజన్ 3 కంటెస్టెంట్స్‌కి అవకాశాలు రాకుండా ఇంట్లో కూర్చోవడానికి కారణం కరోనా అని అలీ రెజా అంటున్నారు. ఇటీవల 'వైల్డ్ డాగ్' సినిమాలో నాగార్జునతో కలిసి నటించిన అలీ రెజా.. సీజన్ 3లో పాల్గొన్న తమకి సరైన అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను తెలియజేశాడు. సీజన్ 3 వాళ్లకి, సీజన్ 4 వాళ్లకి చాలా వేరియేషన్ ఉందని.. వాళ్లకి మంచి అవకాశాలు వస్తున్నాయని.. తమకు మాత్రం రావడం లేదని.. కారణం ఏంటో నాగార్జున గారికి కూడా తెలుసని అన్నారు.
బిగ్ బాస్ సీజన్ 3 అయిపోయిన తరువాత అందరం సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉన్నామని.. కరెక్ట్ గా అదే సమయంలో లాక్‌డౌన్ ప్రకటించారని అన్నారు. నిజానికి బిగ్ బాస్ షో తరువాత కంటెస్టెంట్స్ కి వచ్చే హైప్ కొన్నాళ్లు మాత్రమే ఉంటుందని.. దాన్ని లిమిటెడ్ కాలంలోనే ఉపయోగించుకోవాలని.. కానీ అదే సమయంలో కరోనా వచ్చి.. అందరినీ ఇంట్లో కూర్చోబెట్టేసిందని చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్ సమయంలోనే సీజన్ 4 మొదలయిందని.. అందరూ ఇంట్లో ఉండి షోని బాగా ఎంజాయ్ చేశారని.. దీంతో సీజన్ 4 కంటెస్టెంట్స్ కి బయటకి వచ్చిన తరువాత మంచి ఆఫర్లు వస్తున్నాయని.. ఇలా చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
Also Read